phone icon in white color

Call Us

Book Free Appointment

USFDA-Approved Procedure

USFDA-Approved Procedure

Support in Insurance Claim

Support in Insurance Claim

No-Cost EMI

No-Cost EMI

1-day Hospitalization

1-day Hospitalization

Choose Your City

It help us to find the best doctors near you.

Bangalore

Chennai

Delhi

Hyderabad

Mumbai

Noida

Pune

Delhi

Hyderabad

Pune

Mumbai

Bangalore

Best Doctors for Cataract Surgery
  • online dot green
    Dr. Varun Gogia (N1ct9d3hko)

    Dr. Varun Gogia

    MBBS, MD
    18 Yrs.Exp.

    4.5/5

    18 Years Experience

    location icon 26, National Park Rd, near Moolchand Metro station, Vikram Vihar, Lajpat Nagar IV, Lajpat Nagar, New Delhi, Delhi 110024
    Call Us
    080-6541-4427
  • online dot green
    Dr. Vishnu Vahan Prasan (rsG98g0FRA)

    Dr. Vishnu Vahan Prasan

    MBBS, Diploma in Ophthalmology
    29 Yrs.Exp.

    4.5/5

    29 Years Experience

    location icon 31, 80 Feet Rd, Hal, HAL 3rd Stage, Indiranagar, Bengaluru, Karnataka 560038
    Call Us
    080-6510-5146
  • online dot green
    Dr. Chanchal Gadodiya (569YKXVNqG)

    Dr. Chanchal Gadodiya

    MS, DNB, FICO, MRCS, Fellow Paediatric Opth
    12 Yrs.Exp.

    4.5/5

    12 Years Experience

    location icon GRCW+76R, Jangali Maharaj Road Dealing Corner, Shivajinagar, Pune, Maharashtra 411004
    Call Us
    080-6510-5216
  • వ్యాధి గురించి
    అవలోకనం
    ప్రిస్టిన్ కేర్ ఎందుకు?
    అవాంతరాలు లేని బీమా ఆమోదం
    కారణాలు
    లక్షణాలు
    చికిత్స విభాగం
    Read More

    క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏమిటి?

    కేటరాక్ట్ సర్జరీ అనేది కంటిశుక్లం యొక్క శస్త్రచికిత్స చికిత్స. ఇది లోపభూయిష్ట(Defective) లేదా మేఘావృతమైన కంటి లెన్స్‌ను తీసివేసి, దానిని కృత్రిమ లెన్స్‌తో భర్తీ చేస్తుంది. కంటిశుక్లం అనేది సాధారణంగా వయస్సుతో సంభవించే వ్యాధి, కానీ కంటి గాయం లేదా జన్యుపరమైన కారకాలు వంటి ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. ఇది మందుల ద్వారా తగ్గదు లేదా చికిత్స చేయబడదు. మరియు ఇది సమయానికి చికిత్స చేయకపోతే, కంటిశుక్లం శాశ్వత అంధత్వాన్ని(permanent blindness) కూడా కలిగిస్తుంది. కంటి శుక్లాలకు శస్త్ర చికిత్స ఒక్కటే శాశ్వత పరిష్కారం. మీకు ఒక కన్ను లేదా రెండు కళ్లలో కంటిశుక్లం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, మీరు ప్రిస్టిన్ కేర్‌ను సంప్రదించి, అన్ని రకాల కంటిశుక్లాలకు అధునాతన చికిత్సను పొందవచ్చు.

    ప్రమాదాలు

    • వృద్ధాప్యం
    • మధుమేహం
    • ధూమపానం
    • సూర్యరశ్మికి అధికంగా ఎక్సపోజ్ అవ్వడం(UV)
    • ఊబకాయం
    • డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం
    • మునుపటి కంటి కి చేసిన శస్త్రచికిత్స కారణం
    • కంటి గాయం

    cost calculator

    కంటిశుక్లం శస్త్రచికిత్స Cost Calculator

    Fill details to get actual cost

    i
    i
    i

    To confirm your details, please enter OTP sent to you on *

    i

    • రోగనిర్ధారణ పరీక్షలు మరియు మందులపై 30% తగ్గింపు
    • ఉచిత పికప్ మరియు డ్రాప్
    • తాజా లేజర్ సర్జికల్ టెక్నాలజీ
    • శస్త్రచికిత్స అనంతర ఉచిత ఫాలో-అప్‌లు
    • 100% బీమా క్లెయిమ్

    • అన్ని బీమాలు కవర్ చేయబడ్డాయి
    • ముందస్తు చెల్లింపు లేదు
    • బీమా అధికారుల వెంట పడడం ఉండదు
    • మీ తరపున ప్రిస్టిన్ కేర్ బృందం పేపర్ వర్క్ చూసుకుంటారు

    • వృద్ధాప్యం
    • ధూమపానం
    • అతినీలలోహిత వికిరణం(Ultraviolet radiation)
    • మధుమేహం
    • హైపర్ టెన్షన్
    • ఊబకాయం
    • అధిక ఆల్కహాల్ వినియోగం
    • అధిక మయోపియా(High myopia)
    • మునుపటి కంటి కి చేసిన శస్త్రచికిత్స

    • మేఘావృతమైన(Cloudy) కంటి లెన్స్
    • మసక మసకగా కనిపించడం
    • వెలిసిన రంగులు చూస్తున్నారు
    • రాత్రి చూడడానికి ఇబ్బంది
    • కాంతి చుట్టూ హాలోస్(Halos)
    • కాంతికి సున్నితత్వం పెరగడం
    • ద్వంద్వ దృష్టి

    చికిత్స

    వ్యాధి నిర్ధారణ

     

    మీకు దృష్టి సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే, ఆలస్యం చేయకుండా నేత్ర వైద్యుడిని సంప్రదించండి. సమస్యను తగ్గించడానికి డాక్టర్ మీ వైద్య చరిత్ర మరియు లక్షణాల గురించి అడుగుతారు. మీకు ఒక కన్ను లేదా రెండు కళ్లలో కంటిశుక్లం ఉందని డాక్టర్ నిర్దారించినట్లు అయితే ఈ క్రింది పరీక్షను సిఫారసు చేయవచ్చు.

     

    • విజువల్ అక్యూటీ టెస్ట్– ఈ పరీక్ష కంటి శక్తిని లేదా ఒక వ్యక్తి ఎంత స్పష్టంగా ఒక వస్తువును చూడగలుతున్నాడో అని తనిఖీ చేయడానికి వైద్యుడికి సహాయపడుతుంది.

     

    • స్లిట్-ల్యాంప్ పరీక్ష– ఈ పరీక్షలో కార్నియా, ఐరిస్ మరియు ఐ-లెన్స్ ను పరీక్షిస్తారు.అలాగే ఐరిస్ మరియు కార్నియా మధ్య ఖాళీని కూడా తనిఖీ చేస్తారు. 

     

    • రెటీనా పరీక్ష– ఇది రెటీనా వెనుక వైపు స్పష్టంగా చూడడానికి జరుగుతుంది. కంటిశుక్లం యొక్క సంకేతాల కోసం కంటి లెన్స్‌ను పరిశీలించడానికి పుపిల్స్(Pupils)ను విస్తరిస్తారు,దీని కోసం కంటి కటకాన్ని ఉపయోగించబడుతుంది.

     

    • టోనోమెట్రీ టెస్ట్– ఈ పరీక్ష కళ్లలోపల ఒత్తిడిని తనిఖీ చేయడానికి మరియు అవసరమైతే గ్లాకోమా(glaucoma) యొక్క ప్రారంభ సంకేతాలను కూడా చూసేందుకు చేయబడుతుంది.

    సర్జరీ

     

    క్యాటరాక్ట్ సర్జరీ అనేది కంటిశుక్లం యొక్క చికిత్సకు ఉపయోగించే ప్రక్రియ.

     

    MICS – మైక్రో ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ (MICS) అనేది 1.8 మిమీ కంటే తక్కువ కోత ద్వారా కంటిశుక్లాలను తొలగించే విధానం.ఈ శస్త్రచికిత్స యొక్క ప్రయోజనం ఏంటి అంటే శస్త్రచికిత్స యొక్క ఫలితాన్ని మెరుగుపరచడం. MICS అనేది మెరుగైన శస్త్రచికిత్స అనంతర ఫలితాలను అందించే అతి తక్కువ బాధాకరమైన శస్త్రచికిత్స అని రుజువుఅయింది. ఈ అధునాతన కంటిశుక్లం శస్త్రచికిత్సలో, అధిక స్థాయి శస్త్రచికిత్స ఖచ్చితత్వం మరియు ఆవిష్కరణ ఉపయోగించబడుతుంది.

     

    MICS యొక్క ప్రయోజనాలు:

     

    • చిన్న కోత
    • శస్త్రచికిత్స ద్వారా ప్రేరేపించబడిన ఆస్టిగ్మాటిజం(astigmatism) యొక్క అవకాశాలు తగ్గుతాయి
    • దృష్టి వేగంగా కోలుకోవడం
    • వేగంగా నయమవుతుంది 

     

    FLACS – ఫెమ్టోసెకండ్ లేజర్-సహాయక కంటిశుక్లం చికిత్స (FLACS) అనేది కంటిశుక్లం శస్త్రచికిత్స రంగంలో ఇటీవలి అభివృద్ధి చెందినది.నాన్ – FLACS యొక్క చిన్న కోత ఫాకోఎమల్సిఫికేషన్(phacoemulsification) కంటిశుక్లం శస్త్రచికిత్సతో పోలిస్తే FLACS తక్కువ ప్రమాదాలను కలిగి ఉంటుంది. మాన్యువల్ టెక్నిక్‌లతో పోల్చితే, నిర్దిష్ట టిష్యూల కోసం FLACS అధిక స్థాయి ఖచ్చితత్వం మరియు పునరావృతతను అందిస్తుంది.

     

    మీరు కళ్లు చూపు సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మరియు కంటిశుక్లాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలనుకుంటే, ఈరోజే ప్రిస్టిన్ కేర్‌ని సంప్రదించండి.

    కంటిశుక్లం గురించి వాస్తవాలు

    • కంటి శుక్లాలు అనేవి కంటి లెన్స్ యొక్క పైన పొర.
    • లెన్స్‌లోని ప్రొటీన్లు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు కంటిశుక్లం అభివృద్ధి చెందుతుంది.
    • 70 ఏళ్లు వచ్చేసరికి సగానికి పైగా భారతీయులకు కంటిశుక్లం వస్తుంది.
    • కంటిశుక్లం రావడానికి దారితీసే ప్రధాన కారకాలు – సూర్యుడికి కళ్ళు ఎక్కువగా గురికావడం, ఊబకాయం, ధూమపానం, అధిక మయోపియా, కంటి గాయం మరియు కుటుంబ చరిత్ర.
    • శుక్లాలలో 4 రకాలు ఉన్నాయి – సబ్‌క్యాప్సులర్, న్యూక్లియర్, కంజెనిటల్ మరియు కార్టికల్.
    • కంటిశుక్లం అనేది వయసు పెరిగే కొద్దీ ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ కంటి సమస్యగా పరిగణించబడుతుంది.
    • కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన శస్త్రచికిత్సలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

    కంటిశుక్లం ఎలా ఏర్పడుతుంది?

    కంటిశుక్లం ఏర్పడింది అని అర్థం చేసుకోవడానికి,ముందుగా మీరు మీ కంటి లెన్స్ యొక్క పనితీరు మరియు పనిని అర్థం చేసుకోవాలి. ఇది కెమెరా లెన్స్ మాదిరిగానే పని చేస్తుంది. లెన్స్ రెటీనాపై కాంతిని కేంద్రీకరిస్తుంది మరియు స్పష్టంగా చూడటానికి మీకు సహాయపడుతుంది. లెన్స్ మీ కళ్ళ యొక్క రంగు భాగం (కనుపాప) వెనుక ఉంది. కళ్ళలోకి ప్రవేశించే కాంతిని కేంద్రీకరించడం ద్వారా లెన్స్ పనిచేస్తుంది మరియు రెటీనాపై స్పష్టమైన మరియు పదునైన చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది.

    లెన్స్ ప్రాథమికంగా ప్రోటీన్ మరియు నీటితో కూడి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో, లెన్స్‌లోని ప్రోటీన్ కాంతిని దాటి రెటీనాను చేరుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా చిత్రం ఏర్పడుతుంది. కానీ వృద్ధాప్యంతో, ప్రోటీన్ ఒకదానితో ఒకటి కలిసిపోయి లెన్స్‌పై డిపాజిట్ అవ్వడం ప్రారంబంకావచ్చు. కంటి లెన్స్ వయస్సుతో పాటు తక్కువ ఫ్లెక్సిబుల్ మరియు తక్కువ పారదర్శకంగా మారుతుంది. కొన్నిసార్లు వృద్ధాప్యం కాకుండా, వయస్సు-సంబంధిత వైద్య పరిస్థితులు మరియు ఇతర వైద్య పరిస్థితులు కూడా లెన్స్ కణజాలం మరియు ప్రోటీన్ రెండు కలుసుకోవడానికి దారితీయవచ్చు.

    దీని కారణంగా, లెన్స్‌పై తేలికపాటి పొర ఏర్పడుతుంది, ఇది దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. ఈ విధంగా కంటిశుక్లం అభివృద్ధి చెందుతుంది.పరిష్కరించబడే వరకు ఈ పరిస్థితి ముందుకు సాగుతువుంటుంది. కంటిశుక్లం లెన్స్ నుంచి వెళ్ళే కాంతిని చెదరగొట్టి అడ్డుకుంటుంది మరియు రెటీనాకు చేరకుండా చేస్తుంది. ఫలితంగా, మీ దృష్టి అస్పష్టంగా(Blur) మారుతుంది.

    కంటిశుక్లం రకాలు:

    ప్రధానమైనవి 4 రకాలు ఉన్నాయి మరియు ఇతర రకాలు సెకండరీ, రేడియేషన్ etc ఉన్నాయి.

    • సబ్‌క్యాప్సులర్ కంటిశుక్లం – ఇది లెన్స్ వెనుక భాగంలో ఏర్పడుతుంది. అధిక మధుమేహం లేదా అధిక మోతాదులో స్టెరాయిడ్ మందులు వాడుతూ ఉన్న వ్యక్తులకు ఈ రకమైన కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
    • న్యూక్లియర్ కంటిశుక్లం – ఈ రకమైన కంటిశుక్లం లెన్స్ యొక్క సెంట్రల్ జోన్‌లో లోతుగా అభివృద్ధి చెందుతుంది. న్యూక్లియర్ కంటిశుక్లం సాధారణంగా వృద్ధాప్యంతో ఏర్పడుతుంది.
    • కార్టికల్ కంటిశుక్లం – కంటిశుక్లం యొక్క ఈ రూపంలో, తెల్లటి, చీలిక వంటి అస్పష్టతలు లెన్స్ యొక్క అంచున ఏర్పడతాయి. కంటిశుక్లం యొక్క ఈ రూపం లెన్స్  కార్టెక్స్లోలో(Cortex) సంభవిస్తుంది.
    • పుట్టుకతో వచ్చే కంటిశుక్లం- ఈ రకమైన కంటిశుక్లం శిశువులు మరియు పిల్లలలో సంభవిస్తుంది. చాలా మంది శిశువులు పుట్టుకతో వచ్చే కంటిశుక్లాలతో పుడతారు, అయితే అవి జన్యుపరమైన కారకాలు, గర్భాశయంలోని ఇన్ఫెక్షన్ లేదా గాయం కారణంగా కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి.

    కంటిశుక్లం నివారణలు:

    వైద్యం కంటే నివారణే మేలు అనే పాత సామెత, ఇతర వ్యాధుల మాదిరిగానే కంటిశుక్లంకు కూడా చెల్లుతుంది. కంటిశుక్లం కారణంగా దృష్టిని కోల్పోకుండా నిరోధించడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి:

    • మీ రోజువారీ ఆహారాన్ని మార్చుకోండి
    • పొగ త్రాగుట మానేయండి
    • అతినీలలోహిత వికిరణం(Ultraviolet Radiation) నుండి రక్షించుకోండి
    • మీ రక్తంలో షుగర్ ను నియంత్రించండి
    • గాయంని నివారించండి
    • అనవసరంగా స్టెరాయిడ్స్ వాడడాన్ని తగ్గించేయండి
    • రెగ్యులర్ కంటి చెకప్

    కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రిస్టిన్ కేర్ అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందా?

    రోగుల సేఫ్టీ మరియు సెక్యూరిటీ మాకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల, మేము అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటున్నాము మరియు COVID-19 సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు పేర్కొన్న ప్రతి ప్రమాణాలను అనుసరిస్తున్నాము. ఇక్కడ కొన్ని భద్రతా చర్యలు ఉన్నాయి-

    • క్లినిక్ సిబ్బందికి ఇన్ఫెక్షన్ నుండి రోగనిరోధక శక్తిని కలిగించడానికి వారికి నిరంతర టీకాలు వేయడం
    • క్లినిక్ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి యొక్క థర్మల్ స్క్రీనింగ్
    • క్లినిక్‌లలో శానిటైజర్‌ డిస్‌పెన్సింగ్‌ మెషిన్‌లను సరిగ్గా ఉంచడం
    • రద్దీ ప్రమాదాన్ని తగ్గించడానికి ముందస్తుగా బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లు
    • సంప్రదింపుల గదులు అలాగే పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం మరియు శానిటైజ్ చేయడం

    కంటిశుక్లం చికిత్స కోసం ప్రిస్టిన్ కేర్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

    మా సర్జన్లు రోగి యొక్క అవసరాలను కీలకమైన అంశంగా ఉంచుతూ మొత్తం ప్రక్రియను ప్లాన్ చేస్తారు అలాగే అమలు చేస్తారు. శస్త్రచికిత్స అనవసరంగా ఆలస్యం కాకుండా చూసుకోవడానికి, మేము ప్రతి రోగికి ఈ క్రింది వాటిని అందిస్తాము-

    • ప్రక్రియ జరిగిన రోజు రోగులను తీసుకెళ్లడానికి మరియు దింపడానికి క్యాబ్ సౌకర్యాలు
    • రికవరీ సమయంలో అనుసరించాల్సిన సరైన పోస్ట్-ఆపరేటివ్ సూచనలు
    • ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోగి యొక్క రికవరీని ట్రాక్ చేయడానికి ఫాలో-అప్‌లు
    • ఆర్థిక విషయాలపై రోగులతో 100% పారదర్శకత
    • రోగులకు క్లినిక్‌లో ఇబ్బంది లేని అనుభవం ఉండేలా సాధ్యమైన ప్రతి విధంగా సహాయం
    Consult with Our Expert Doctors for FREE!
    cost calculator
    i
    i
    i
    i
    Call Us

    To confirm your details, please enter OTP sent to you on *

    i

    చాలా తరచుగా అడిగే ప్రశ్నలు

    కంటిశుక్లం చికిత్స కోసం నేను ఏ వైద్యుడిని సంప్రదించాలి?

    మీరు కంటిశుక్లం యొక్క చికిత్స కోసం చూస్తూన్నట్లయితే, మీరు ఆప్టిషియన్(optician) లేదా ఆప్టోమెట్రిస్ట్(optometrist) వద్దకు వెళ్లే బదులు నేరుగా నేత్ర వైద్యుడిని సంప్రదించాలని సూచన చేయబడింది. అన్ని కంటి పరిస్థితులను నిర్ధారించడం మరియు చికిత్స చేయడంలో నేత్ర వైద్యుడు ప్రత్యేకత కలిగి ఉంటాడు. అందువల్ల, చికిత్సలో ఆలస్యాన్ని నివారించడానికి వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.

    కంటిశుక్లం కోసం నేను ఉత్తమ వైద్యుడిని ఎలా కనుగొనగలను?

    ఉత్తమ కంటిశుక్లం వైద్యుడిని కనుగొనడానికి, మీరు ఈ చిట్కాలను అనుసరించాలి:

    • డాక్టర్ సర్టిఫికేషన్ ను తనిఖీ చేయండి
    • వైద్యుడికి దగ్గర చెల్లుబాటు(Valid) అయ్యే లైసెన్స్ ఉందని నిర్ధారించుకోండి
    • డాక్టర్‌కి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందో అడగండి
    • మునుపటి రోగులను సంప్రదించడం ద్వారా డాక్టర్ నైపుణ్యాలను విశ్లేషించండి
    • రోగి టెస్టిమోనియల్‌లు(Statements) మరియు సమీక్షల ద్వారా చూడండి
    • డాక్టర్ మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో చూడండి

    కంటిశుక్లం శస్త్రచికిత్స ఖర్చు ఎంత?

    కంటిశుక్లం శస్త్రచికిత్స మీకు సగటున, సుమారు ఒక్కో కంటికి రూ. 25,000 నుండి రూ. 35,000 అవుతుంది. వ్యాధి యొక్క తీవ్రత, సర్జన్ ఫీజు, రీప్లేస్‌మెంట్ కోసం ఉపయోగించే లెన్స్ రకం, చికిత్స కోసం ఎంచుకున్న పద్ధతి, మందులు, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మొదలైన కొన్ని కారణాల వల్ల ఖచ్చితమైన ఖర్చు మారవచ్చు.

    ప్రిస్టిన్ కేర్‌లో కంటిశుక్లం చికిత్స ఖర్చును కవర్ చేయడానికి నేను నా ఆరోగ్య బీమాను ఉపయోగించవచ్చా?

    కంటిశుక్లం శస్త్రచికిత్స వైద్యపరంగా అవసరం మరియు ఆరోగ్య బీమా పాలసీల కింద కవర్ చేయబడుతుంది. అందువల్ల, ప్రిస్టిన్ కేర్‌లో కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం చెల్లించడానికి మీరు మీ బీమా పాలసీని ఉపయోగించవచ్చు. మా మెడికల్ కోఆర్డినేటర్లు పేషెంట్ తరపున పేపర్ వర్క్ మరియు దావా(Claim) ప్రక్రియను నిర్వహిస్తారు.

    కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

    మీరు మరుసటి రోజు నుండి దృష్టిని తిరిగి పొందగలరు మరియు అలాగే మీ ప్రాథమిక కార్యకలాపాలను నిర్వహించగలరు. అయితే, పూర్తి పూర్తి రికవరీకి  సుమారు 3-4 వారాలు పట్టవచ్చు. ఈ కాలంలో, మీ కళ్ళు సరిగ్గా నయం అయ్యేలా చూసుకోవడానికి మీరు డాక్టర్ ఇచ్చిన సలహాను జాగ్రత్తగా పాటించాలి.

    శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి రాగలదా?

    కంటిశుక్లం సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత మళ్ళీ తిరిగి రాదు. అయితే, కొన్ని సందర్భాల్లో, కణజాలం విచ్ఛిన్నమై లెన్స్‌పై డిపాజిట్ కావచ్చు. అయితే లెన్స్ కృత్రిమమైనది కాబట్టి, లేజర్ సహాయంతో నిక్షేపణను సులభంగా తొలగించవచ్చు.

    ప్రిస్టిన్ కేర్ వైద్యులు కంటిశుక్లాలకు ఎలా చికిత్స చేస్తారు?

    ప్రిస్టిన్ కేర్ వైద్యులు రెండు అత్యంత ప్రభావవంతమైన శస్త్రచికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు,అవి ఏంటి అనగా, FLACS మరియు MICS. ఈ పద్ధతులు కనిష్టంగా ఇన్వాసివ్‌గా ఉంటాయి మరియు శస్త్రవైద్యులు కంటిశుక్లంను సురక్షితంగా తొలగించడానికి సహాయపడతాయి.

    ప్రిస్టిన్ కేర్ వైద్యులు ఆన్‌లైన్ సంప్రదింపులను అందిస్తారా?

    ప్రిస్టిన్ కేర్‌లోని క్యాటరాక్ట్ వైద్యులు ఆన్‌లైన్ సంప్రదింపుల కోసం అందుబాటులో ఉన్నారు.మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్ మోడ్‌ను ఎంచుకొని డాక్టర్‌తో మీ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు.ఆన్‌లైన్ కన్సల్టేషన్ మోడ్‌ మీ ఇంటి వద్ద నుండి ఫోన్ కాల్ ద్వారా వైద్యునితో వాస్తవంగా కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

    కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స 20/20 దృష్టిని ఇస్తుందా?

    చాలా మంది రోగులు కంటిశుక్లం-తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత 20/20 దృష్టిని సాధిస్తారు. 20/20 దృష్టి అనేది 20 అడుగుల దూరం నుండి దృష్టి యొక్క స్పష్టతను వ్యక్తీకరించడానికి ఉపయోగించే పదం. కంటి నిపుణుడు క్లౌడీ లెన్స్‌ని తీసివేసి, దాని స్థానంలో కృత్రిమ క్లియర్ లెన్స్‌ని అమర్చిన తర్వాత, మీరు విషయాలను స్పష్టంగా చూడగలరు. మీకు ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితి లేకుంటే, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత మీరు 20-20 దృష్టిని సాధించవచ్చు. మీ దృష్టిని ప్రభావితం చేసే కంటిశుక్లం కాకుండా మరేదైనా ఉంటే, దృష్టి స్పష్టతను పునరుద్ధరించడంలో మీకు సహాయపడటానికి వైద్యుడు దానిని కూడా తనిఖీ చేసి చికిత్స చేయొచ్చు.